కొరిటెపాడు (గుంటూరు): యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ పిలుపుతో చేపట్టిన ఆందోళనలకు స్పందన లభించిందని ఏఐబీఓసీ రాష్ట్ర నాయకులు శేష సాయి, జయకుమార్, కోటిరెడ్డి, రాంబాబు, వేణులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం నగరంపాలెంలోని ఎస్‌బీఐ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీఎఫ్‌ఎస్ తీసుకున్న పీఎల్‌ఐ అమలు నిర్ణయం ప్రస్తుతం చీఫ్ లేబర్ కమిషనర్(సీఎల్‌సీ) వద్ద పరిష్కార దశలో ఉన్నప్పటికీ అమలు చేయడం ఏకపక్ష, తొందరపాటు చర్య అని విమర్శించారు. ఈ పథకం ఉద్యోగులు, యూనియన్లు కోరింది కాదని, కొద్ది మందికి మాత్రమే లాభం ఉందని అభిప్రాయపడ్డారు. ఉద్యోగులను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపివేసి, సమస్య పరిష్కరించాలని వారు కోరారు.
నేడు గుంటూరు నగరానికి డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా రాక
నగరంపాలెం(గుంటూరు వెస్ట్) : రాష్ట్ర డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా గురువారం గుంటూరు నగరంలో పర్యటించనున్నారు. నగరంపాలెంలోని గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో నూతన సమావేశ మందిరం, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్) జిల్లా నూతన భవనాన్ని రాష్ట్ర డీజీపీ ప్రారంభించనున్నట్లు డీపీఓ కార్యాలయ వర్గాలు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏపీ విట్ విశ్వ విద్యాలయం చాన్సలర్, వైస్‌చాన్సలర్, రిజిష్ట్రర్, జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొంటారని పేర్కొన్నారు.


