గుంటూరు | - | Sakshi
Sakshi News home page

గుంటూరు

Mar 25 2026 7:24 AM | Updated on Mar 25 2026 7:24 AM

పునర్విభజనతో మారనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం

న్యూస్‌రీల్‌

9 అసెంబ్లీ స్థానాలు పెరగొచ్చు..

తెరపైకి ‘తెనాలి’

డీఆర్‌డీఏ పీడీ తనిఖీలు

బుధవారం శ్రీ 25 శ్రీ మార్చి శ్రీ 2026
రూపురేఖలు
పునర్విభజనతో మారనున్న ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రం

సాక్షి, నరసరావుపేట: దేశంలో లోక్‌సభతోపాటు శాసనసభ స్థానాల పునర్విభజనకు కేంద్రం సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో అందరి నోటా ఇదే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్‌ సమావేశాలలోనే ఈ బిల్లును ఆమోదించేలా అన్ని రాజకీయ పార్టీలతో కేంద్రం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో నేతలు ‘కొత్త’ లెక్కలేసుకుంటున్నారు. జిల్లాలో కొత్తగా ఎన్ని సీట్లు పెరగనున్నాయి, ఏ ఏ మండలాలతో ఏర్పడితే రాజకీయంగా తమకు అనుకూలమనే ఆలోచనలో వారు ఉన్నారు. సిట్టింగ్‌, మాజీ ఎమ్మెల్యేలు తమ సొంత మండలం కొత్తగా ఏర్పడే వేరే నియోజకవర్గంలోకి వెళితే ఏం చేయాలన్న ఆలోచనలు మొదలుపెట్టారు. మరోవైపు ఎవరూ ఊహించని విధంగా పునర్విభజన ద్వారా ఏకంగా 50 శాతం స్థానాల సంఖ్య పెరుగుతాయన్న వార్తలతో ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయ ముఖచిత్రమే మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

చట్టసభలకు వెళ్లాలనుకునే వారిలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. నియోజకవర్గాల సంఖ్య పెరగడం, మహిళా రిజర్వేషన్‌ అమలులోకి రానుండటంతో కొత్తవారికి చట్టసభలకు వెళ్లే అవకాశాలు పెరగనున్నాయి. 2008లో జరిగిన అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో కొంతమేర మార్పుచేర్పులు జరగగా... తాజా పునర్విభజనతో సమూల మార్పులు రానున్నాయని రెవెన్యూ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో కేవలం అసెంబ్లీ స్థానాలు మాత్రమే మార్పు జరగగా... ఈసారి లోక్‌సభ స్థానాలలో సైతం పునర్విభజన జరగనుంది.

ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో ప్రస్తుతం 17 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో గుంటూరు, పల్నాడు జిల్లాల పరిధిలో ఏడు చొప్పున, బాపట్ల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. తాజా పునర్విభజన తరువాత ఉమ్మడి జిల్లాలో కొత్తగా 8 నుంచి 9 స్థానాలు పెరిగే అవకాశముంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య 25గానీ, 26గానీ కానుంది. గతంలో అసెంబ్లీ స్థానాలుగా ఉండి రద్దైన ఫిరంగిపురం, పెదకాకాని, దుగ్గిరాలలతోపాటు గుంటూరు రూరల్‌, నగరం, రొంపిచర్ల, పిడుగురాళ్ల, కారంపూడి, అమరావతి వంటి కొత్త అసెంబ్లీ స్థానాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ స్థానాలు కొత్తగా మరో 9 పెరగనున్న నేపథ్యంలో ఆశావహుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. మరోవైపు ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో తాడికొండ, ప్రత్తిపాడు, వేమూరు నియోజకవర్గాలు ఎస్సీ సామాజికవర్గానికి రిజర్వు కాగా... ఈ సంఖ్య పునర్విభజన తరువాత పెరగనుంది. ప్రస్తుత గుంటూరు ఈస్ట్‌, వెస్ట్‌తోపాటు తెనాలి, నరసరావుపేట వంటి అర్బన్‌ స్థానాలు ఏర్పడే అవకాశముంది.

నిజాంపట్నం: స్థానిక సచివాలయం–2ను డీఆర్‌డీఏ పీడీ బి.సింగయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు.

9 శాసనసభ, 2 లోక్‌సభ

నియోజకవర్గాలు కొత్తగా

ఏర్పడే అవకాశం

మహిళా రిజర్వేషన్‌ బిల్లు

అమలుతో అతివలకు అందలం

ఎనిమిది నుంచి తొమ్మిది

స్థానాలు మహిళలకు కేటాయింపు

ఏ ప్రాంతం ఏ నియోజకవర్గంలో ఉంటుందో.. అభ్యర్థి ఎవరో..

అంటూ ప్రజల్లో చర్చ

భవిష్యత్‌ ఎలా ఉంటుందోనని

ఇప్పటి నుంచే లెక్కలు

వేసుకుంటున్న రాజకీయ నేతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement