సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సీపీఎం నేతల వినతి
తెనాలి: ఎల్‌పీజీ గ్యాస్ సక్రమంగా ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సీపీఎం నాయకుడు కొల్లిపర బాబుప్రసాద్ కోరారు. స్థానిక సబ్‌కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో సీపీఎం నాయకులు ఎల్‌పీజీ గ్యాస్‌ను అందుబాటులో ఉంచాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు కొల్లిపర బాబుప్రసాద్ మాట్లాడుతూ, తెనాలి పట్టణంలో వినియోగదారులు గ్యాస్ బుకింగ్ కోసం ఏజెన్సీలకు ఫోన్ చేస్తే స్పందించటం లేదని చెప్పారు. ఒకవేళ స్పందించి రిజిస్టరు చేసుకున్నా రెండు వారాలు గడిచినా డెలివరీ చేయటం లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు ఎల్‌పీజీ గ్యాస్‌కు ఎటువంటి కొరత లేదని, గ్యాస్ సరఫరాకు కూడా ఎలాంటి అవరోధం ఉండడానికి వీలు లేదని హామీలు ఇచ్చారని గుర్తుచేస్తూ, వాస్తవ పరిస్థితి ఆ విధంగా లేదన్నారు. పౌర సరఫరాల శాఖ అధికారులు జోక్యం చేసుకుని సకాలంలో, సక్రమంగా సీరియల్ ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ిసీపీఎం నాయకులు షేక్ హుస్సేన్‌వలి, రాజ శేఖర్ పాల్గొన్నారు.


