కళల తెనాలిలో ‘స్వరలయ’ కళాసేవ అమోఘం | - | Sakshi
Sakshi News home page

కళల తెనాలిలో ‘స్వరలయ’ కళాసేవ అమోఘం

Mar 24 2026 8:01 AM | Updated on Mar 24 2026 8:01 AM

● ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ రంగాలలోని వ్యక్తులను గుర్తించి వారిని సముచితరీతిన గౌరవించడం అభినందనీయమని చెప్పారు. ● పిరమిడ్‌ యోగా గురువు డాక్టర్‌ జాస్తి సుబ్బారావు ప్రసంగిస్తూ, ఒకే వ్యక్తి సంవత్సరాల తరబడి సంగీత, సాహిత్య, సాంస్కృతిక కార్తక్రమాలను ప్రతిఫలం లేకుండా 540 కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. స్వరలయ వేదిక సారథి సాయి లక్కరాజు పట్టుదలకు ఈ కృషి నిదర్శనమన్నారు. ● బ్యాంకింగ్‌ రంగం నుంచి భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ హైదరాబాద్‌ అంబుడ్సుమన్‌ శాఖ రీజనల్‌ మేనేజర్‌ పి.ప్రశాంత్‌ కుమార్‌, విద్యారంగం నుంచి డాక్టర్‌ బండి విజయకుమార్‌, రవాణా రంగం నుంచి తోట రాఘవరావు ఉగాది పురస్కారాలను అతిథుల చేతుల మీదుగా ప్రదానం చేశారు. ● సంస్థ వ్యవస్థాపకుడు సాయి లక్కరాజు స్వాగతం పలుకగా, రావిపాటి ప్రేమ్‌ కుమార్‌ వందన సమర్పణ చేశారు. ● తొలుత సత్యవర్ధన్‌, నాగమణి, శ్రీనివాస్‌, విష్ణుప్రియల పాటలతో సంగీత విభావరిని నిర్వహించారు.

రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు

తెనాలి: కళలకు జన్మభూమి వంటి తెనాలిలో నిత్యకళాసేవ చేస్తూ, క్రమం తప్పక చేసే కార్యక్రమాలలో స్వరలయ నిర్వహించే ఉగాది ఉత్సవాలు చిరస్మరణీయమని రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్‌ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పట్టణానికి చెందిన సంగీత, సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక ఆధ్వర్యంలో స్థానిక బోసురోడ్డులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ అమ్మవారి దేవస్థాన ప్రాంగణంలో ఆదివారం రాత్రి ఉగాది పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. సభకు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ విశ్రాంత సీఈవో దైవాల సుబ్రహ్మణ్యం అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమంలో తిరుమలరావు, దుర్గాప్రసాద్‌, మల్లేశ్వరరావు, రవిమోహన్‌, గోపాలకృష్ణ, ఉమామహేశ్వరరావు, డాక్టర్‌ పురుషోత్తమరావు, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement