పట్నంబజారు: వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబును పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గత కొద్ది కాలం క్రితం టీడీపీ గూండాలు అంబటిపై దాడికి యత్నించి, నివాసం, కార్యాలయం పగులకొట్టిన విషయం విధితమే. ఈ క్రమంలో సిద్ధార్థ నగర్‌లోని ఆయన నివాసంలో అంబటిని కలిసిన కాటసాని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతలు చేసిన దాడి వివరాలను పరస్పరం చర్చించుకున్నారు. వైఎస్సార్ సీపీ నేతలు కాటసానికి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు.
తెనాలిఅర్బన్: 2003 సంవత్సరంలో ఎంపికై 2004లో విధుల్లో చేరిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఓపీఎస్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎయిడెడ్ ఉపాధ్యాయులు కోరారు. బోసురోడ్డులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రి లోకేష్‌తో మాట్లాడి న్యాయం జరిగే విధంగా చూస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు ఉపాధ్యాయులు చెప్పారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ తెనాలి కన్వీనర్ పుట్టా జనార్ధనరావు, ఎయిడెడ్ ఉపాధ్యాయులు అనిశెట్టి శ్రీనివాసులు, ఎం.నాగమ్మ, షేక్ జాకీర్, వెంకటేశ్వరరావు, మంజుల, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


