సంక్షోభంలో పాఠశాల విద్యారంగం | - | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో పాఠశాల విద్యారంగం

Mar 23 2026 8:44 AM | Updated on Mar 23 2026 8:44 AM

గుంటూరు ఎడ్యుకేషన్‌: రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం సంక్షోభంలో ఉందని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు అన్నారు. ఆదివారం జిల్లా కోర్టు వద్ద ఉన్న ఏపీటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సంఘ జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో పాఠశాల విద్యారంగం సంక్షోభంలోకి నెట్టి వేయబడిందని అన్నారు. పాఠశాల విద్యలో అనేక ప్రయోగాలను చేస్తూ, పాఠశాలలను ప్రయోగ పరీక్ష కేంద్రాలుగా మార్చి వేశారని అన్నారు. కూటమి పాలనలో విద్యారంగంలో తెచ్చిన ఏ ఒక్క పథకం, కార్యక్రమం నాణ్యమైన విద్య అందించేదిగా లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా విద్యారంగంపై ప్రయోగాలు మానుకుని, విద్యార్థులకు ఉపయోగపడే శాసీ్త్రయమైన విద్యావిధానాన్ని మాతృభాషలో కొనసాగించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసిన ప్రాథమిక పాఠశాలల తరగతులు ఉపసంహరించుకోవాన్నారు. 12వ పీఆర్సీ కమిషన్‌ చైర్మన్‌ను నియమించి, 30శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయ బదిలీలు, ఉద్యోగోన్నతులను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, సంఘ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పి.పాండురంగ వరప్రసాదరావు మాట్లాడుతూ విద్యాశాఖాధికారులు నిరంకుశంగా అమలు చేస్తున్న విద్యార్థి, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను పోరాటాల ద్వారానే ఎదుర్కోవాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకుడు షేక్‌ జిలానీ మాట్లాడుతూ 79 ఏళ్లుగా ఏపీటీఎఫ్‌ విద్యారంగ ప్రగతికి, ఉపాధ్యాయ సంక్షేమానికి నిరంతరం పనిచేస్తోందని, కార్యకర్తలు నిత్య చైతన్యంతో పనిచేయాలని సూచించారు. పేద ప్రజల బిడ్డలకు మంచి విద్యను అందించాలన్నారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న గుడిపాటి దాస్‌ మాట్లాడుతూ కార్యకర్తలు, నాయకుల సమష్టి కృషితో సంఘ నిర్మాణానికి, ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. కార్యవర్గ సమావేశంలో ఏపీటీఎఫ్‌ రాష్ట్ర జీఓ కమిటీ కన్వీనర్‌ సయ్యద్‌ చాంద్‌ బాషా, జిల్లా శాఖ అధ్యక్షుడు గుడిపాటి దాస్‌, ప్రధానకార్యదర్శి మహమ్మద్‌ ఖాలీద్‌, ఉపాధ్యక్షులు పి.నాగశివన్నారాయణ, పుట్టా జనార్ధనరావు, పి.పార్వతి, జిల్లా కార్యదర్శులు గడ్డిపాటి శివరామకృష్ణ, చక్కా వెంకటేశ్వరావు, కె.శ్రీనివాసరావు, పి.శివరామకృష్ణ, రాష్ట్ర కౌన్సిలర్లు బి.సాయి లక్ష్మీ, కె.రమేష్‌ వివిధ మండల శాఖల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవ లింగారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement