మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం ఆదివారం భక్తజనంతో కోలాహలంగా మారింది. తెల్లవారుజాము నుంచే తెలుగు ఉభయ రాష్ట్రాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కళకళలాడింది. నాగ పుట్ట, నాగమల్లి వృక్షం, పొంగళ్లశాల వద్ద భక్తుల రద్దీ ఏర్పడింది. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మదుసూధనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగే వివిధ సేవా టికెట్ల ద్వారా స్వామి వారికి రూ. 8,35,885 ఆదాయం వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.


