తెనాలి రూరల్: తెనాలిలో శనివారం రాత్రి ట్రాఫిక్ స్తంభించిపోయింది. మార్కెట్ యార్డు నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో పాలకవర్గ సభ్యులు పట్టణంలో శనివారం రాత్రి భారీ ర్యాలీలు నిర్వహించారు. చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు వేర్వేరుగా ర్యాలీలు, డీజేలతో హోరెత్తించారు. దీంతో మార్కెట్ వంతెన నుంచి సుల్తానాబాద్ వరకు ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. గంటన్నరకుపైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పోలీసులు మార్కెట్ యార్డు వద్ద బందోబస్తులో బిజీగా ఉండడం, సరిపడినంత మంది సిబ్బంది లేకపోవడంతో ట్రాఫిక్ నియంత్రణ కష్టమైంది. పండుగ, సెలవు కావడంతో సాయంత్రం కుటుంబసభ్యులతో కలసి బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


