తెనాలి రూరల్: రంజాన్ పండుగ రోజున పట్టణంలో విషాదం నెలకొంది. కాలువలో ఈతకు దిగి వ్యక్తి మరణించాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని సుల్తానాబాద్‌కు చెందిన మహబూబ్ వలి (38) తన మిత్రుడు బుజ్జితో కలసి రంజాన్ పండుగ సందర్భంగా మద్యం తాగాడు. అనంతరం సాయంత్రం మార్కెట్ సమీపంలో తూర్పు కాలువలో ఈతకు దిగాడు. వలి మునిగిపోగా స్థానికులు గమనించి ఒడ్డుకు లాగారు. కొన ఊపిరితో ఉన్న అతను కొద్దిసేపటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మద్యం తాగి ఈతకు దిగామని, వలి నీటిలో మునిగి మృతి చెందాడని బుజ్జి తెలిపాడు. వలి మార్బుల్, ఇతర పనులకు వెళుతూ లాడ్జీల్లో ఉంటుంటాడని పోలీసులు తెలిపారు.


