గ్యాస్‌ కొరతతో హోటళ్లు మూత | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ కొరతతో హోటళ్లు మూత

Mar 21 2026 5:04 AM | Updated on Mar 21 2026 5:04 AM

గ్యాస్‌ కొరతతో హోటళ్లు మూత

బ్లాక్‌లో సిలిండర్‌ ధర రూ.2,500 నుంచి రూ. 3 వేలు

గుంటూరు రూరల్‌: గ్యాస్‌ కొరతతో టీ దుకాణాలు, హోటళ్లు, భోజనం మెస్‌లు మూతపడ్డాయి. ముందు ముందు గ్యాస్‌ దొరకదేమోనన్న అపోహలతో ప్రజలు గ్యాస్‌ కొనుగోలుకు తహతహలాడుతున్నారు. గ్యాస్‌ ఏజెన్సీల వద్ద ప్రతి నిత్యం బారులు తీరుతున్నారు. గ్రామాల్లో ఐతే వీధులకు వీధులు ప్రజలు గ్యాస్‌ సరఫరా కేంద్రాలకు ట్రాక్టర్‌లతో వస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్‌ సిలిండర్‌ కావాలంటే రూ. 2500 నుంచి రూ. 3000 వరకూ చెల్లించాల్సిందే. బ్లాక్‌ మార్కెట్‌ నిర్వాహకులు అత్యవసరంగా ఉండే వారిని, ఫంక్షన్‌లు తదితర కార్యక్రమాలు చేసుకునే వారినే లక్ష్యంగా అధిక ధరలకు విక్రయిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement