ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం: జిల్లాలోని పోలీస్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీస్ స్టాఫ్ గ్రీవెన్‌న్స్ నిర్వహించారు. పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించే పోలీస్ సిబ్బంది వినతులను జిల్లా ఎస్పీ స్వీకరించారు. జిల్లా ఎస్పీ మాట్లా డుతూ ఒకసారి దొర్లిన పొరపాట్లను మరలా జరగకుండా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించు కోవా లని అన్నారు. జిల్లాలోని ప్రజలకు ఉత్తమ పోలీస్ సేవలు అందించాలని చెప్పారు. పోలీస్ సిబ్బంది సమస్యలను విధిగా పరిష్కరిస్తామని అన్నారు.
ఫిరంగిపురం: మండలంలోని పొనుగుపాడు గ్రామంలో నుదురుపాడు పశువైద్యశాల ఆధ్వర్యంలో పశువులకు వేస్తున్న గాలికుంటువ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ టి.శ్రీనివాసరావు పరిశీలించారు. గాలికుంటు టీకాలకు సంబంధించి పశువుల రక్తనమూనాల సేకరణ, క్షేత్రస్థాయిలో టీకాలు వేసిన పశువులను ఆయన పాడి రైతులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించి సిబ్బందికి శాఖపరమైన సూచనలు చేశారు. ఆయన వెంట పశువైద్యాధికారి షేక్.పీర్ అహ్మద్, జిల్లా ఏడీడీఎల్ ల్యాబ్ పశువైద్యాధికారి లావణ్య, లైవ్‌స్టాక్ అసిస్టెంట్ ఆర్.వినీల, సిబ్బంది ఉన్నారు.
దుగ్గిరాల:ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టా కు శుక్రవారం 1,016 క్యూసెక్కులు విడుదల చేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపా రు. బ్యారేజీ వద్ద 12 అడుగుల నీటిమట్టం స్థిరంగా ఉంది. దుగ్గిరాల సబ్ డివిజన్ బ్యాంక్ కెనాల్‌కు 60 క్యూసెక్కులు, తూర్పు కాలువకు 145, పశ్చి మ కాలువకు 110, కొమ్మూరు కాలువకు 200 క్యూసెక్కులు బ్యారేజీ నుంచి విడుదల చేశారు.


