ఆరంభమైన వసంత నవరాత్ర మహోత్సవాల సందడి | - | Sakshi
Sakshi News home page

ఆరంభమైన వసంత నవరాత్ర మహోత్సవాల సందడి

Mar 21 2026 5:04 AM | Updated on Mar 21 2026 5:04 AM

తెనాలి: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా పట్టణంలో వసంత నవరాత్రి మహోత్సవాల సందడి ఆరంభమైంది. స్థానిక బోసురోడ్డులోని హనుమాన్‌ చౌక్‌లోని శ్రీ సీతారామ మందిరంలో 94వ వార్షిక వసంత నవరాత్ర మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభించారు. ఉత్సవాల్లో భాగంగా రెండోరోజైన శుక్రవారం రాత్రి మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. తొలిగా ప్రఖ్యాత గాయని వేంపాటి కృష్ణశ్రితచే శాసీ్త్రయ సంగీత కచేరీ సంగీతాభిమానులను పరవశింపజేసింది. పలు కీర్తనలను ఆమె శ్రావ్యంగా ఆలపించారు. వయొలిన్‌పై గౌరావఝుల ఆంజనేయశాస్త్రి, తబలపై పెరవలి వంశీకృష్ణ వాయిద్య సహకారం అందించారు. తదుపరి కళ్యాణి కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ నృత్యగురువు డాక్టర్‌ చల్లా బాలత్రిపురసుందరి శిష్యబృందం కూచిపూడి నృత్యాంశాలను ప్రదర్శించారు. శ్రీసీతారామ మందిర నిర్వహణ సేవాసంఘం కార్యదర్శి కల్లూరి వేంకట సూర్యనారాయణమూర్తి, సభ్యులు నేతి ఆంజనేయశాస్త్రి పర్యవేక్షించారు. అగ్నిహోత్రం నరసింహాచార్యులు పూజాదికాలను జరిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement