తాడికొండ: రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగంగా అమలు చేస్తున్న డిజిటల్ ప్రణాళికా విధానానికి జాతీయ గుర్తింపు లభించిందని ఏపీ సీఆర్‌డీఏ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అమరావతి ఇంటిగ్రేటెడ్ డిజిటల్ అర్బన్ ప్లానింగ్ అండ్ గవర్నెన్స్ ప్లాట్‌ఫామ్‌కు ఎకనామిక్ టైమ్స్ గోవ్‌టెక్ అవార్డు– 2026 కార్యక్రమంలో గోల్డ్ అవార్డు లభించిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎకనామిక్ టైమ్స్ సంస్థ నుంచి ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ కె.కన్నబాబు ఢిల్లీలో గురువారం అవార్డు అందుకున్నారని వారు పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో ఉత్తమ సాంకేతిక ప్రాజెక్టులకుగాను ఈ అవార్డును అందించారని తెలిపారు.


