మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటీ? | - | Sakshi
Sakshi News home page

మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటీ?

Dec 9 2025 9:25 AM | Updated on Dec 9 2025 9:25 AM

మా ప్

మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటీ?

మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటీ?

తాడేపల్లి రూరల్‌: మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటి? దుమ్ము లేవకుండా బండరాళ్లు దొర్లకుండా ఎటువంటి గ్యారెంటీ ఇస్తారు? అప్పటివరకు క్వారీ నిలిపివేయాలని ఉండవల్లి దళితవాడకు చెందిన ప్రజలు ఆదివారం రాత్రి క్వారీ నిర్వాహకులను నిలదీశారు. ఆదివారం రాత్రి సమయంలో కొండపై భారీ యంత్రాలతో తవ్వుతున్న క్రమంలో వంద అడుగుల పై నుంచి ఓ బండరాయి దొర్లుకుంటూ ఇళ్లమీదకు వచ్చింది. అక్కడే వున్న ఓ వ్యక్తి పక్క నుంచి ఆ రాయి వెళ్లింది. ఎటువంటి ప్రమాదం చోటుచేసుకోకపోవడంతో ఆ ఇంట్లో వాళ్లు, కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఉండవల్లిలో రాత్రి పగలు తేడా లేకుండా ఎర్రమట్టి తవ్వకాలు నిర్వహించడంతో గ్రామం మొత్తం దుమ్మ ఏర్పడి ఇళ్లల్లో పేరుకుపోతోందని, వాతావరణంలో గాలి కూడా కలుషితం అవుతోందని, ఇప్పుడేమో రాళ్లు దొర్లుతున్నాయని, మా ప్రాణాలు గాలిలో కలిసిపోయే పరిస్థితి ఏర్పడిందని.. దళితవాడ వాసులు వాపోతున్నారు. ప్రభుత్వం తమ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాలంటూ క్వారీ కింద భాగంలో ఆందోళన చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజెప్పాలని చూడగా.. క్వారీలో మట్టి తవ్వకాలు నిలిపివేస్తేనే ఇక్కడి నుంచి వెళతామని చెప్పడంతో తాత్కాలికంగా క్వారీలో మట్టితవ్వకాలను నిలిపివేశారు. అనంతరం తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి జరిగిన సంఘటనపై పోలీసులకు వివరించారు. పోలీసుల నుంచి స్పష్టమైన హామీ రాలేదు.

తాత్కాలికంగా నిలిచిపోయిన క్వారీ....

గత సంవత్సరం కాలం నుంచి నిరంతరం ఉండవల్లి క్వారీలో మట్టి తవ్వకాలను నాలుగు భారీ యంత్రాలతో నిర్వహిస్తున్నారు. గ్రామంలో కొంతమంది ఆందోళన చేయడంతో కొండపై వున్న ఆ భారీ యంత్రాలను కిందకి దించివేయడంతో తాత్కాలికంగా క్వారీ నిలిచిపోయింది. నిర్వాహకులు మాత్రం తమకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు. గ్రామస్తులు తమ ప్రాణాలకు గ్యారెంటీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

ఉండవల్లి దళితవాడలోకి దొర్లుకుంటూ వచ్చిన బండరాయి

కాలనీవాసికి త్రుటిలో తప్పిన ప్రమాదం

స్పష్టమైన హామీ ఇచ్చి క్వారీ

నిర్వహించాలని నిర్వాహకులను

నిలదీసిన స్థానికులు

తాత్కాలికంగా నిలిచిపోయిన

ఉండవల్లి క్వారీ

మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటీ? 1
1/1

మా ప్రాణాలకు గ్యారెంటీ ఏంటీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement