పోటీతత్వంతోనే ప్రతిభకు గుర్తింపు
గుంటూరు ఎడ్యుకేషన్: పోటీతత్వంతోనే ప్రతిభకు గుర్తింపు దక్కుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పేర్కొన్నారు. సోమవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్‌లో కౌశల్ జిల్లాస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతి ప్రదానోత్సవం గావించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ రేణుక మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో శాసీ్త్రయ ప్రతిభను పెంపొందించేందుకు కౌశల్ పరీక్షలు దోహదపడతాయన్నారు. జిల్లా కౌశల్ కో–ఆర్డినేటర్ ఎం.సురేష్‌కుమార్ మాట్లాడుతూ క్విజ్, పోస్టర్, రీల్స్ తయారీ అనే అంశంపై ఆన్‌లైన్‌లో నిర్వహించిన పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 8,9,10 తరగతుల నుంచి పాల్గొన్న 610 మంది విద్యార్థుల్లో ఆరుగురు ప్రథమ, మరో ఆరుగురు ద్వితీయ బహుమతులు పొంది, రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ప్రథమ బహమతి రూపంలో రూ.1,500, ద్వితీయ బహుమతి రూపంలో రూ.వెయ్యి నగదు అందజేశారు. ఉప విద్యాశాఖాధికారి జి.ఏసురత్నం, డీసీఈబీ కార్యదర్శి ఎ.తిరుమలేష్, పాఠశాల కో–ఆర్డినేటర్లు శాంతిప్రియ, రామాంజనుయులు, రవీంద్రబాబు, నిర్మల, బాలకృష్ణ పాల్గొన్నారు.
–క్విజ్ విభాగంలో షేక్ రషీద్ (అంకిరెడ్డిపాలెం), సీహెచ్ మనోహ (వంగిపురం), షేక్ నస్రీన్ (మాచవరం) ప్రధమ బహుమతి, ఎ.వెంకట తనూజ (ప్రత్తిపాడు), పి.ప్రియాంక, ఎం.కీర్తన (కాకుమాను) ద్వితీయ బహమతి సాధించారు.
–పోస్టర్ విభాగంలో బి.అమూల్య (అత్తోట), వి.విలియం బాబు (కాకుమాను) ప్రథమ బహుమతి, టి.వాసవి (ముట్లూరు), ఎం.శ్రీవిద్య (సంగం జాగర్లమూడి) ద్వితీయ బహుమతి పొందారు.
– రీల్స్ విభాగంలో సయ్యద్ ఖాసిం (వేములూరిపాడు), మహి (గోగులమూడి) ప్రథమ, ద్వితీయ బహుమతులు సాధించారు.
జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక


