బాలోత్సవంలో అలరించిన చిన్నారులు | - | Sakshi
Sakshi News home page

బాలోత్సవంలో అలరించిన చిన్నారులు

Dec 1 2025 9:26 AM | Updated on Dec 1 2025 9:26 AM

బాలోత్సవంలో అలరించిన చిన్నారులు

బాలోత్సవంలో అలరించిన చిన్నారులు

మంగళగిరి టౌన్‌: బాలోత్సవంలో చిన్నారులు అదరహో అని పించారు. పిల్లలు కాదు... పిడుగులు అన్న విధంగా ఆ చిన్నారుల ప్రదర్శనలు సాగాయి. ఒకరిని మించి ఒకరు మించి ప్రదర్శనలు ఇచ్చి ఔరా అనిపించారు. మంగళగిరి– తాడేపల్లి బాలోత్సవం పట్టణ పరిధిలోని అరవింద మోడల్‌ స్కూల్‌లో ఆదివారం రెండవ రోజు అదిరేలా నిర్వహించారు. తెలుగులో ఉపన్యాసం, మట్టితో బొమ్మలు, ఇంగ్లిష్‌లో ఉపన్యాసం, జానపద నృత్యాలు, శాసీ్త్రయ నృత్యాలు, లఘు నాటికలు, ఏకపాత్రాభినయం, దేశభక్తి గీతాలు, కోలాటం వంటి కార్యక్రమాల్లో బాలలు పాల్గొని చూపరులను ముగ్ధులను చేశారు. కార్యక్రమానికి అమరావతి బాలోత్సవం రాష్ట్ర కన్వీనర్‌ పి.మురళీకృష్ణ, రాష్ట్ర బాధ్యులు ఐజాక్‌ న్యూటన్‌లతో పాటు నాగేశ్వరరావు, వి.వి.ప్రసాద్‌, శాంతిరెడ్డి, పి.రాజశేఖర్‌, వల్లభనేని వాణి, ఎం.విజయమోహనరావు, సిందే బాలకృష్ణ పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement