ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నైపుణ్య శిక్షణ
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్ జిల్లాలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు అర్హత ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు నైపుణ్యాల అభివృద్ధికి శిక్షణ కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా పరిశ్రమలు, ఎగుమతుల ప్రోత్సాహక మండలి(డి.ఐ.ఇ.పి.సి) సమా వేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు కోసం వచ్చిన దరఖాస్తులకు నిర్దేశిత సమయంలో అనుమతులు జారీ చేయాలన్నారు. జిల్లాలో పరిశ్రమలకు వివిధ రాయితీలకు రూ.95,72,060 మంజూరు చేస్తూ కమిటీలో ఆమోదించారు. సమావేశంలో డీఆర్వో షేఖ్ ఖాజావలి, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం జయలక్ష్మి, డీపీఓ బి.వి.నాగసాయికుమార్, జిల్లా సాంఘిక సంక్షేమ అధికా రి చెన్నయ్య, డీఆర్‌డీఏ పీడీ టి.విజయలక్ష్మి, కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వాహక ఇంజినీర్ నజీనాబేగం పాల్గొన్నారు.
పుస్తక పఠనంతో విజ్ఞానం, మనోవికాసం
గుంటూరు ఎడ్యుకేషన్: పుస్తక పఠనం విజ్ఞానంతోపాటు మనోవికాసానికి దోహదపడుతుందని, ఇది పౌర గ్రంథాలయాల ద్వారానే సాధ్యపడుతుందని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. శుక్రవారం అరండల్‌పేటలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభంతో బాలల దినోత్సవాన్ని నిర్వహించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ జి.కోటేశ్వరరావు, ఎమ్మెల్యే గళ్లా మాధవితో కలిసి సరస్వతిదేవి పూజ, జ్యోతి ప్రజ్వలన చేశారు.


