శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
నేలవాలిన చేలో దిగాలుగా కౌలు రైతు కాకి రమేష్
తెనాలి రూరల్ మండల గ్రామం నేలపాడు. అక్కడ మాగాణి పొలం కౌలు ఎకరాకు రూ.30 వేలు. నగదు మొత్తం ముందుగా చెల్లిస్తేనే కౌలుదారు చేలోకి వెళ్లగలుగుతాడు. అందరిలాగే కౌలురైతు కాకి రమేష్ మూడుచోట్ల తొమ్మిదెకరాలు కౌలుకు తీసుకున్నాడు. అప్పులు తెచ్చి అక్షరాలా రూ.2.70 లక్షలు నగదు కౌలు చెల్లించాడు. మోంథా తుఫాన్‌కు మొత్తం పంటంతా నేలక్కరుచుకుంది. పన పట్టుకుని పైకి తీస్తే మొలకలు కనిపిస్తున్నాయి. కంకుల్లో గింజ గట్టిపడింది తక్కువ. ఎకరాకు రూ.25–30 వేల పెట్టుబడి చొప్పున మొత్తం రూ.లక్షలపైనే వ్యయం చేశాడు. ఇప్పుడు చేనుకేసి చూసిన అధికారి లేడు. ఎన్యూమరేషన్ లేదు. నష్టపరిహారం వచ్చే ప్రసక్తే లేదని తెలిసి అతడికి నోట మాట రావటం లేదు.
పడిపోయిన పైరు..
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025


