ప్రభుత్వానికి కనిపించని తీరు
నాలుగెకరాలు పడిపోయింది....
గింజ పాలు పోసుకోలేదు...
ప్రభుత్వ నిర్లక్ష్యంతో అన్నదాతల ఆవేదన
రైతును దెబ్బతీసిన మోంథా తుఫాన్
వేలాది ఎకరాలలో నేలవాలిన వరి చేలు
నష్టం అంచనాకు కూడా రాని అధికారులు
కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం
పెట్టుబడులు కాదుగదా కనీసం
కౌలు కూడా రాని దుస్థితి
తెనాలి: ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం, కౌలురైతు సంఘం రాష్ట్ర నాయకులు గురువారం తెనాలి రూరల్ మండలంలోని తేలప్రోలు, నేలపాడు గ్రామాల్లోని పంటపొలాలను సందర్శించినపుడు పంటలు దెబ్బతిన్న రైతులు/కౌలు రైతులు తమ గోడు వినిపించారు. అందులో నేలపాడుకు చెందిన కౌలు రైతు కాకి రమేష్ ఒకరు. పంటల నష్టం స్పష్టంగా కళ్లకు కనిపిస్తున్నా ఏం నష్టం లేదని ప్రభుత్వం చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. మాగాణి భూముల్లోని వరి పైరు మొత్తానికి నష్టం కలిగిందని ఎవరూ చెప్పటం లేదు. అయిదు శాతమో? పది శాతమో పంటపొలాలు దెబ్బతిన్న విషయాన్ని ఎవరూ కాదనటం లేదు. మరి వారికి కలిగిన నష్టానికి పరిహారం ఇచ్చేదెవరు? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
పంట రాదని తెలిసీ..మళ్లీ పెట్టుబడులు..
సార్వా వరి కోతలు మరో వారం, పదిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. నేలవాలిన వరి చేలల్లో అర్ధ గింజకు మించి దిగుబడి రాదని తేలిపోయింది. సాధారణ చేలో గంటలో పూర్తయే నూర్పిడి, పడిపోయిన చేలల్లో మూడు గంటల సమయం తీసుకుంటుంది. అంటే నూర్పిడి వ్యయం మూడురెట్లు అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. పంట పెద్దగా రాదని తెలిసీ మళ్లీ అధిక పెట్టుబడులు పెట్టాల్సి రావటంతో రైతులు దిగులు పడుతున్నా రు. ప్రతి గింజ కొనుగోలు చేస్తామని చెబుతున్న ప్రభుత్వం, మసరు వచ్చిన గింజను కొంటుందా? లేదా? అనేది మరో సమస్యగా చెబుతున్నారు.
వైఎస్ జగన్ హయాంలో ....
ఇదే సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అమలు చేసిన ఉచిత పంటల బీమాను రైతులు/కౌలురైతులు గుర్తుచేసుకుంటున్నారు. అప్పట్లో ప్రభుత్వమే రైతుల తరపున ఉచిత బీమా చేయించింది. ప్రకృతి వైపరీత్యాలతో పంటల నష్టం జరిగినపుడు, మరుసటి సీజనులో పంటల సాగుకు ముందే పరిహారం డబ్బులు చెల్లించినట్టు రైతులు చెప్పారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఉచిత బీమా తీసేయటంతో అటు బీమా పరిహారం వచ్చే అవకాశం కూడా లేదని విచారపడుతున్నారు.
ఇదిలాఉంటే ఖరీఫ్ సీజనులో యూరియా కోసం పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రైతులు, రెండో పంటగా జొన్న/మొక్కజొన్న సాగుకు యూరియాను ముందే సేకరిస్తున్నారు. బయట మార్కెట్లో యూరియా రూ.390 –420లకు కొనుగోలు చేశామనీ, అదికూడా నానో లిక్విడ్ కొంటేనే అనే షరతుతో అమ్ముతున్నారని చెప్పారు.
సీజను మొదట్లో రెండుసార్లు వెద పెట్టాల్సి వచ్చింది. నాలుగెకరాల్లో వరి సాగుచేస్తే తుఫాన్‌కు మూడెకరాల్లో పైరు నేలకొరిగింది. అంతా కౌలు పొలమే. ఎకరాకు 20–21 బస్తాల ధాన్యం కౌలుకు తీసుకున్నాను. పడకుండా నిలిచి ఉంది ఏమవుతుందో తెలీదు. యూరియా కట్ట రూ.400 చేసి కొన్నాం. సబ్సిడీ యూరియా అందలేదు. కనీసం పడిపోయిన చేలనన్నా లెక్కలోకి తీసుకోవాలి కదా!
– షేక్ హుస్సేన్, కౌలురైతు, తేలప్రోలు
నేను 17 ఎకరాల్లో వరి వేశా ను. తుఫాన్ కారణంగా నాలుగెకరాలకు పైగా పైరు పడిపోయింది. ఆ పంటలోంచి గింజలు వచ్చే లా లేదు పాలు పోసుకోకుండా తాలు గింజలు కనిపిస్తున్నాయి. పడిపోయిన చేలో కోతకూడా కూడా సమస్యగానే మారనుంది.
– సోమవరపు నాగమల్లేశ్వరరావు,
రైతు, నేలపాడు
ప్రభుత్వానికి కనిపించని తీరు
ప్రభుత్వానికి కనిపించని తీరు


