మాజీ ఎంపీ శివాజికి పరామర్శ
నగరంపాలెం: మాజీ ఎంపీ డాక్టర్ యలమంచిలి శివాజీని ఆదివారం బృందావన్‌గార్డెన్స్‌లోని ఆయన నివాసంలో స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న తనయుడు, మాజీ మంత్రి గౌతు శ్యాంసుందర శివాజీ పరామర్శించారు. పాత జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అనంతరం ఇరువురిని విశ్రాంత పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాళహస్తి సత్యనారాయణ సత్కరించారు. శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాల పాలకవర్గం కార్యదర్శి పాటిబండ్ల విష్ణువర్ధన్, పలువురు పాల్గొన్నారు.
నేడు పెదకాకాని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం
పెదకాకాని: పెదకాకాని మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్ష పదవిపై అవిశ్వాస తీర్మాన సమావేశం సోమవారం జరగనుంది. నాలుగు సంవత్సరాలు పూర్తయిన ఎంపీపీ పదవిని ఎలాగైనా దక్కించుకోవాలని అక్కసుతో రెండు నెలలుగా కూటమి నాయకులు రాయబేరాలు చేశారు. 2021లో జరిగిన మండల పరిషత్ ఎన్నికల్లో పెదకాకాని మండలానికి సంబంధించి 12 గ్రామాల నుంచి 21 మంది ఎంపీటీసీ సభ్యులుగా పోటీ చేశారు. వారిలో 15 మంది ఎంపీటీసీ వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందారు. ఆరుగురు టీడీపీ నుంచి విజయం సాధించారు. నాలుగేళ్లు పూర్తి కావడంతో ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటికే పలువురు ఎంపీటీసీ సభ్యులను శనివారం అర్ధరాత్రి రాజమండ్రి తరలించినట్లు విశ్వసనీయ సమాచారం.
రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలు
నరసరావుపేట ఈస్ట్: పల్నాడు జిల్లా బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాలలో రాష్ట్రస్థాయి ఉపాధ్యాయుల సాంస్కృతిక పోటీలను నిర్వహించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి దాదాపు 550 మంది ఉపాధ్యాయులు పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శాసీ్త్రయ నృత్యం, నాటికలు, దేశభక్తి గేయాలు, బుర్రకథలు, జానపద నృత్యం, ఏకపాత్రాభినయం, పద్యాలు, కోలాటం తదితర అంశాలలో పోటీలను నిర్వహించారు. ప్రస్తుత విద్యారంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రదర్శించారు.
మాజీ ఎంపీ శివాజికి పరామర్శ


