ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేసిన కూటమి ప్రభుత్వం
లక్ష్మీపురం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలల పాలనలోనే రూ.2.5 లక్షల కోట్లు అప్పులు తెచ్చి ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టేసిందని సీపీఐ జాతీయ సమితి సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో జిల్లా సహాయ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య అధ్యక్షతన ఆదివారం జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభు త్వం కార్పొరేట్ వర్గాల కోసమే పనిచేస్తోందని అ న్నారు. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభం ప్రజలను తీవ్ర కష్టాల్లోకి నెట్టా యని అన్నారు. సీపీఐ శతవార్షికోత్సవాల సందర్భంగా డిసెంబరు 26న ఖమ్మంలో జరిగే మహాసభలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు, అభిమానులు విస్త్తృతంగా పాల్గొని విజయవంతం చేయాల ని పిలుపునిచ్చారు. నవంబరు 18న సామాజిక న్యాయంపై అన్ని పార్టీలు, ప్రజాసంఘాలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబరు 20 నుంచి డిసెంబరు 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా శతవార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన హామీలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కి ందన్నారు. సమావేశంలో వేదికపై సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ సమితి సభ్యులు
ముప్పాళ్ల నాగేశ్వరరావు
‘చలో ఖమ్మం’ విజయవంతం
చేయాలని పిలుపు


