ప్రజా ఉద్యమంపై విస్తృత ప్రచారం చేయండి
పట్నంబజారు: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 12వ తేదీన జరగనున్న ప్రజా ఉద్యమాన్ని జయప్రదం చేసే దిశగా, విస్తృతమైన ప్రచారం చేయాల్సిన బాధ్యత సోషల్ మీడియా సభ్యులపై ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు కొరిటిపాటి ప్రేమ్‌కుమార్ పేర్కొన్నారు. బృందావన్ గార్డెన్స్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లాలోని సోషల్ మీడియా నియోజకవర్గాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులతో సమావేశం నిర్వహించారు. ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం జరుగుతున్న ఈ ఉద్యమాన్ని భుజాన వేసుకుని ముందుకు తీసుకుని వెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ముఖ్యంగా మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అయితే జరిగే నష్టం ప్రజలకు వివరించాలన్నారు. ప్రభుత్వ కుట్రలను సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. ప్రతి సోషల్ మీడియా సభ్యులు కచ్చితంగా 12న జరిగే ర్యాలీలో పాల్గొనాలని కోరారు. అనంతరం పోస్టర్‌లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా విభాగం రాష్ట్ర కార్యదర్శి మేకా వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జావీద్, గుంటూరు పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల అధ్యక్షులు, రమేష్, సాగర్, ఉపాధ్యక్షుడు కర్రి భాస్కర్, కార్యదర్శి నంద కిషోర్, జిల్లా కమిటీ సభ్యులు, మండల విభాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా
జిల్లా అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్


