పోలీసు అమరవీరులకు ఘన నివాళి
ఏఎన్‌యూ(పెదకాకాని): ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సభకు ఎస్‌పీఎఫ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రివిక్రమవర్మ, ఐజీ బీవీ రామిరెడ్డి ఆదేశాల మేరకు కమాండెంట్ డీఎన్‌ఏ బాషా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తొలుత పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రత్యేక రక్షణాదళం(ఏపీ ఎస్‌పీఎఫ్) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఎన్‌యూలో రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్ 2025 క్రీడలు పోటీలు ఈనెల 14వ తేదీ నుంచి కొనసాగుతున్నాయి. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సందేశాన్ని వివరించారు.


