ఏపీ స్టేట్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ పోట
గుంటూరు వెస్ట్ (క్రీడలు): ఏపీ స్టేట్ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ర్యాంకింగ్ పోటీలు గురువారం గుంటూరులో ప్రారంభమయ్యాయి. ఎల్‌వీఆర్ అండ్ సన్స్ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మైనేని బ్రహ్మేశ్వరరావు, యాగంటి దుర్గారావుతో కలిసి శాప్ చైర్మన్ ఎ.రవినాయుడు పోటీలు ప్రారంభించారు. పోటీల నిర్వహణ కార్యదర్శి పులివర్తి వెంకటేశ్వరావు (అజార్) మాట్లాడుతూ.. పోటీలు నవంబర్ 3వ తేదీ వరకు జరుగుతాయని, ఇందులో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. స్నూకర్ విభాగంలో 215 మంది, బిలియర్డ్స్‌లో 38 మంది పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ పోటీల్లో చూపిన ప్రతిభ ఆధారంగా జాతీయ పోటీలకు రాష్ట్ర జట్టును ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులు జనవరి 2026లో హరియాణలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.


