
నగరపాలక సంస్థ అప్కాస్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ అప్కాస్ ఉద్యోగి ఉదయ్‌చంద్ర శనివారం ఆత్మహత్యాయత్నం చేశాడు. ‘‘ఎలక్ట్రికల్ ఏఈ మధు నన్ను విధుల్లో ఇబ్బందులకు గురి చేయడంతో పాటు దుర్భాషలాడాడని.. నా చావుకు మధునే కారణం’’ అని సెల్ఫీ వీడియో తీసుకుని పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో కలకలం రేపింది. స్నేహితులు అడ్డుకోవడంతో ఆత్మహత్యాయత్నాన్ని ఆపేసినట్లు ఉదయ్‌చంద్ర తెలిపాడు. దీనిపై ఏఈ మధుసూదన్‌రావును వివరణ కోరగా గతంలో జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఉదయ్‌చంద్రపై పశ్చిమ ఎమ్మెల్యే పలు ఆరోపణలు చేశారన్నారు. విధులు సక్రమంగా నిర్వహించడం లేదని, లైట్లు ఆన్/ఆఫ్ సక్రమంగా చేయడం లేదని, ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని సభ దృష్టికి తెచ్చారన్నారు. కార్పొరేటర్ల ఫోన్లకు స్పందించడం లేదని, ఉదయ్‌చంద్రను విధుల నుంచి తీసివేయాలని సూచించడంతో కొన్ని రోజులు ఆపామని ఏఈ వివరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు మళ్లీ చేయనని చెప్పడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 29, 30వ డివిజన్లలో పనిచేస్తున్న ఉదయ్‌చంద్రను బుడంపాడు లైట్లు ఆన్/ఆఫ్‌కు మార్చినట్లు తెలిపారు. ఆ విధులకు కూడా హాజరు కాకపోవడంతో అతన్ని ప్రశ్నించడంతో ఆత్మహత్యాయత్నం చేస్తున్నట్లు బెదిరింపులకు దిగాడని మధు వివరించారు.