
గుంటూరు చానల్‌లో పడి వ్యక్తి గల్లంతు
కాజ(మంగళగిరి): గుంటూరు చానల్‌లో పడి వ్యక్తి గల్లంతైన ఘటన మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాజలో చోటు చేసుకుంది. రూరల్ ఎస్‌ఐ సీహెచ్. వెంకటేశ్వర్లు గురువారం తెలిపిన వివరాల మేరకు... కాజ గ్రామానికి చెందిన దొడ్డక రాంబాబు(40) పొలానికి వెళ్లి వస్తూ ప్రమాదవశాత్తూ గుంటూరు చానల్‌పై ఉన్న వంతెన మీద నుంచి కాలువలో పడి గల్లంతయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు రూరల్ ఎస్‌ఐ వెంకట్ ఘటనా స్థలానికి సిబ్బందితో చేరుకుని, గాలింపు చర్యలు చేపట్టారు.వంతెన శిథిలావస్థకు చేరడంతో పాటు ఇరువైపులా ప్రహరీ గోడ లేకపోవడంతో తరచూ ప్రమాదాలు స్థానికులు తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులకు పలుమార్లు తెలియజేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాంబాబు భార్య ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తుండగా, ఇద్దరు పిల్లలున్నారని స్థానికులు తెలిపారు.