
‘స్వచ్ఛతా హి సేవా’తో ఆరోగ్యకర దేశ నిర్మాణం
డీఆర్‌ఎం సుథేష్ఠ
లక్ష్మీపురం: గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో బుధవారం స్వచ్ఛతా హి సేవా కార్యక్రమాన్ని డీఆర్‌ఎం ప్రారంభించారు. ముందుగా కార్యాలయ ప్రాంగణంలో ప్రతిజ్ఞ చేశారు. అనంతరం డీఆర్‌ఎం కార్యాలయ ప్రాంగణంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ ఈ కార్యక్రమం దేశభక్తి, పౌర బాధ్యతను శుభ్రతతో అనుసంధానిస్తుందని తెలిపారు. ప్రజలను ఆరోగ్యకరమైన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములుగా మారేందుకు ప్రేరేపిస్తుందని చెప్పారు. కార్యక్రమంలో ప్రధానంగా 15 రకాల పనులు చేయనున్నట్లు తెలిపారు. ఆరోగ్య శిబిరాలు, మారథాన్, వాకథాన్, మొక్కలు నాటడం, రీ సైకిల్ చేసిన ఉత్పత్తుల విక్రయాలు, ఇంటింటి ప్రచారం వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. రైలు స్టేషన్‌లో మరుగు దొడు, క్యాటరింగ్ ప్రదేశాలలో శుభ్రత, రైల్వే ప్రాంగణంలోని చెరువులు, సరస్సులు వంటి నీటి వనరుల శుభ్రత వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని ప్రతి రైల్వే స్టేషన్,కార్యాలయాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో డివిజన్ ఏడీఆర్‌ఎం రమేష్‌కుమార్, ఆయా శాఖాధిపతులు పాల్గొన్నారు.