
‘ఛత్ర’ గణపతి
గుంటూరు జేసీగా
అశుతోష్ శ్రీవత్స
గుంటూరువెస్ట్: గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అశుతోష్ శ్రీవత్సను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 2021 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన ఇప్పటి వరకు వెయిటింగ్‌లో ఉన్నారు. గుంటూరు జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఎ.భార్గవ్‌తేజను జీఏడీకి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు వెలువడ్డాయి.
డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి
నగరంపాలెం: ఏపీలో పలు రేంజ్‌లలోని ఎనిమిది మంది సీఐలకు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతులుగా కల్పిస్తూ రాష్ట్ర డీజీపీ హరిష్‌కుమార్‌గుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా గుంటూరు రేంజ్‌లోని సీఐలు ఎం.వెంకట సుబ్బారావు, కె.వెంకటేశ్వర్లు, బెల్లం శ్రీనివాసరావు, సీహెచ్ చంద్రమౌళిలకు డీఎస్పీలుగా ఉద్యోగోన్నతి లభించింది.
16 క్వింటాళ్ల
రేషన్ బియ్యం పట్టివేత
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న ముగ్గురిపై పాతగుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పాత గుంటూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముందస్తు సమాచారంతో సీతానగర్ రెండో వీధి పీడీఎస్ దుకాణం నుంచి తరలివెళ్తున్న రేషన్ బియ్యం టాటా ఏసీ ఆటోను బుధవారం పరమయ్యకుంట వద్ద పట్టుకున్నారు. అందులో 16 క్వింటాళ్ల బియ్యం బస్తాలను గుర్తించారు. కోళ్ల మేతకు ఉపయోగించేందుకు ఈ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మేరకు దుకాణం నిర్వాహకుడు దాసరి శ్రీను, ఆటో యజమాని చంద్రశేఖర్‌రెడ్డి, పల్నాడు జిల్లా నకరికల్లు గుండ్లపల్లికి చెందిన షేక్ అలీపై కేసు నమోదు చేశారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.
‘పచ్చ’ పైత్యం... రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలు

‘ఛత్ర’ గణపతి