
పంటలపై పరిశోధన, విస్తరణ దిశగా రోడ్ మ్యాప్
గుంటూరు రూరల్: లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానంలో గురువారం హైదరాబాద్‌కు చెందిన జాతీయ నూనె గింజల సంస్థ, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రాష్ట్రంలో వ్యవసాయ ప్రాముఖ్య అంశాల గుర్తింపుపై రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ నిర్వహించారు. రాష్టంలోని వివిధ వ్యవసాయ జాతీయ పరిఽశోధన సంస్థల ప్రతినిధులు, రాష్ట్రస్థాయి పరిశోధన సంస్థలు, వ్యవసాయ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. వర్క్‌షాప్ నోడల్ ఆఫీసర్ ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్‌కె మధుర్ మాట్లాడుతూ రానున్న ఐదు సంవత్సరాలకు రాష్ట్రంలోని వివిధ పంటల్లో ముఖ్యమైన పరిశోధన, విస్తరణ, అంశాలను గుర్తించి వాటిని సాధించేందుకు అవసరమైన ప్రణాళికల కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలని తెలిపారు. లక్ష్యాన్ని చేరుకునేందుకు వివిధ శాఖల సమన్వయం కావాలన్నారు. ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారదజయలక్ష్మీదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం పద్ధతులను శాసీ్త్రయంగా పరిశోధించి ఫలితాలను రైతులకు అందజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ కె సురేష్, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ మధుమతి, డాక్టర్ పీవి సత్యనారాయణ, డాక్టర్ ఎ.లత పాల్గొన్నారు.
ఐఐఓఆర్ డైరెక్టర్ డాక్టర్ ఆర్.కె. మధుర్