
మంత్రి నారా లోకేష్‌కు ఎక్స్‌లో చేసిన పోస్ట్ ఇదే...
జోజిబాబు అనే వ్యక్తి ఎక్స్‌లో గురువారం ఉదయం 10.45 గంటలకు ‘అన్నా.. నారా లోకేష్ గారు. నా పేరు జోజిబాబు. నా జీవనాధారం అయిన ఇన్నోవా కారును వైఎస్సార్‌సీపీ చెందిన ఒక వ్యక్తి అన్యాయంగా లాక్కుని వెళ్తే ఏడాదిగా నాకు జరిగిన అన్యాయం గురించి గుంటూరులోని నగరంపాలెం పోలీసుల చుట్టూ తిరుగుతున్నా స్పందన లేదు. దయచేసి నా కారు నాకు ఇప్పించండి. నాకు అదే జీవనాధారం.’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. తక్షణమే స్పందించిన లోకేష్ ‘ప్లీజ్ లుక్ ఇన్‌టూ దిస్ ఇష్యూ ఏపీ పోలీస్ 100. కై ండ్లీ ఫాలో అప్.. అండ్ కీప్ మీ అప్‌డేట్ అని పోస్ట్ చేశారు. ప్రేమ్‌కుమార్‌కు అప్పటి వరకు జోజిబాబు నగదు చెల్లించాలని చెప్పిన పోలీసులే... ఇప్పుడు మాటమార్చి స్టేషన్‌కు పిలిపించారు. కారు తక్షణమే అప్పగించాలని లేని పక్షంలో చీటింగ్, దొంగతనం కేసులు బనాయిస్తామని ప్రేమ్‌కుమార్‌ను బెదిరించారు. అవసరం అయితే రౌడీషీట్ కూడా తెరుస్తామని హెచ్చరించారు. గంటల వ్యవధిలో ప్రేమ్‌కుమార్ నుంచి కారు తీసుకున్నారు. తన వద్దకు వచ్చి ప్రాథేయపడి సహాయం పొందిన వ్యక్తి ఎలాగైనా ఆ కారు వెనక్కి తీసుకోవాలని మంత్రి లోకేష్‌కు ఎక్స్‌లో పోస్ట్ చేశారని.... మంత్రి లోకేష్ అప్‌డేట్ చేయమని చెబితే పోలీసులు అత్యుత్సాహంతో కారు తాళాలు తీసుకున్నారని బాధితుడు వాపోయారు. ది ఎంతవరకు సమంజసం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు రావాల్సిన రూ.5 లక్షలు వెనక్కి ఇప్పించాలని కోరారు.