
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు
గుంటూరు మెడికల్: ఏఆర్టీ, సరోగసి యాక్ట్ అమలుపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. గుంటూరు జిల్లాలో ఇప్పటివరకు 27 హాస్పిటళ్లు ఏఆర్టీ, సరోగసి యాక్ట్‌లో రిజిస్టర్ అయి ఉన్నాయన్నారు. చట్టానికి లోబడి ఉండాల్సిన బాధ్యత 27 ఆసుపత్రుల యాజమాన్యాలపై ఉందన్నారు. తనతోపాటు ప్రోగ్రాం ఆఫీసర్లు తరచుగా ఈ ఆసుపత్రులను తనిఖీ చేస్తారని తెలిపారు. ఎక్కడైనా నిబంధనలు పాటించకపోతే వారిపై కేసు నమోదు చేసి, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. రిజిస్టర్ల నిర్వహణ, ధరల పట్టికలు డిస్ ప్లే చేయడం తప్పనిసరి అని పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమించినట్లు తెలిస్తే ఆయా ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి