
సుమారు రూ.40 లక్షల మేరకు నష్టపోయాం...
పెదకాకానిలో ఉంటున్న ఓ మహిళ పరిచయమైంది. తక్కువ ధరకే బంగారపు వస్తువులు ఇప్పిస్తానని తెలిపింది. రాజకీయ నేతలు బాగా తెలుసునని, గతంలో ఒకరిద్దరికి బంగారం ఇప్పించానని నమ్మించింది. మొబైల్‌ఫోన్‌లో బంగారు ఉంగరాలు, గొలుసులు ఇతరత్రా అభరణాలపై ఆశ చూపించేది. ముందుగా రూ.5 లక్షలు పెట్టుబడి రూపంలో చెల్లించాలని షరతులు విధించింది. దీంతో ఇంట్లో వస్తువులు తనఖా పెట్టి, తెలిసిన బంధువుల వద్ద అప్పులు చేసి రూ.పది లక్షలు చెల్లించినట్లు నాగదుర్గ తెలిపింది. ఓ ప్రైవేటు కంపెనీలో డేటా ఆపరేటర్‌గా పనిచేస్తూ, రూ.ఐదు లక్షలు చెల్లించినట్లు మోహన్ నరసింహ కృష్ణ తెలిపారు.
ప్రభుత్వ ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తూ రూ.10 లక్షలు చెల్లించినట్లు మరో బాధితురాలు తెలిపింది. సుమారు ఆమె వద్ద నుంచి రూ.40 లక్షల వరకు రావాల్సి ఉందని బాధితులు తెలిపారు. నెలలో బంగారం ఇప్పిస్తానని ప్రలోభాలు పలికిన ఆమెను పలుమార్లు అడిగినా సరైన సమాధానంలేదు. ఆరు నెలలు గడిచినా బంగారపు ఆభరణాలు ఇవ్వకపోగా.. అడిగితే బెదిరింపులకు పాల్పడుతోంది. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మాకు న్యాయం చేయగలరు.
– జె.నాగదుర్గ, కె.మోహన్ నరసింహ కృష్ణ, అరిఫా, ఓల్డ్‌క్లబ్ రోడ్డు, కొత్తపేట