
కొనేవారు రావడం లేదు
భూములు కొనుగోలు చేసే వారు రావడం లేదు. ప్రభుత్వం మళ్లీ భూ సమీకరణ ప్రకటన చేసినప్పటి నుంచి వ్యాపారాలు సాగడం లేదు. పదేళ్లుగా ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేస్తున్నాను. గతంలో ప్లాట్లు, పొలాలు కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి చుట్టు పక్కల ప్రాంతాల్లో చూపించేవారం. అందుకు ప్రతిఫలంగా వారు కమీషన్ ఇచ్చేవారు. కొనేవారు ఇప్పుడు రాకపోవడంతో వ్యాపారాలు నిలిచిపోయాయి.
– షేక్ మస్తాన్,
రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెదకాకాని
స్థిరాస్తి రంగం కుదేలు
కూటమి ప్రభుత్వం రాజధాని పేరుతో మళ్లీ భూములు సమీకరిస్తుండటంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. అమ్మేవారు సిద్ధంగా ఉన్నప్పటికీ కొనేవారు లేకపోవడంతో వ్యాపారం ఆగిపోయింది. నెల రోజులకు ముందు చేసుకున్న అగ్రిమెంట్లు మాత్రమే రిజస్ట్రేషన్‌లు అవుతున్నాయి. ఈ నెలలో ఒక్క బేరం కూడా జరగలేదు. భూములు కావాలని వచ్చేవారు తగ్గిపోయారు. ప్రభుత్వం భూ సమీకరణపై స్పష్టత ఇవ్వాలి.
– పాటిబండ్ల సంగీతరావు,
రియల్ ఎస్టేట్ వ్యాపారి, పెదకాకాని
●

కొనేవారు రావడం లేదు