
ఇల్లు రాసివ్వడం లేదు..
సుమారు రెండున్నరేళ్ల కిందట ఇల్లు విక్రయిస్తామని చెప్పగా, దశల వారీగా రూ.16 లక్షలు చెల్లించాను. గతేడాదిలో ఇంటి యజమానురాలు మృతి చెందింది. దీంతో మిగతా రూ.14 లక్షలు చెల్లిస్తాను, ఇల్లు రిజిస్ట్రేషన్ చేయాలని ఈ ఏడాది మార్చిలో ఆమె కుటుంబ సభ్యులను అడగ్గా నిరాకరించారు. దీంతో ఉంటున్న ఇంటిని ఖాళీ చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదు. వారి నుంచి ప్రాణహాని ఉంది. న్యాయం చేయగలరు.
– షేక్ సర్తాజ్‌బేగం, చిన్నబజార్, లాలాపేట
క్రెడిట్ కార్డులు తీసుకుని...
ప్రైవేటుగా గృహ రుణాలు ఇప్పిస్తుంటాను. మంగళగిరి రోడ్డులోని ఓ షాపింగ్ మాల్‌లో పనిచేసే వ్యక్తి పరిచయమయ్యారు. ప్రైవేటు బ్యాంక్‌లో రెండు క్రెడిట్ కార్డులను మా పేరిట ఆ వ్యక్తి తీసుకుని, వాడుకున్నాడు. రెండు నెలల్లో చెల్లిస్తానని వాడుకున్న రూ.15 లక్షలు చెల్లించలేదు. సుమారు ఏడాదిన్నర గడిచింది. ఈ ఏడాది జనవరిలో అతనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. క్రెడిట్ కార్డులు దుర్వినియోగం చేసిన తీరు, స్టేట్‌మెంట్‌లను పోలీసులకు అందజేశా. ప్రస్తుతం ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నాం.
– బి.రాధాకృష్ణ, సుజాత, బ్రాడీపేట