నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

Jul 23 2025 12:24 PM | Updated on Jul 23 2025 12:24 PM

నిబద్

నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

నగరంపాలెం: ప్రతి ఒక్కరూ విధి నిర్వహణలో నిబద్ధత, నిజాయతీ, సేవాతత్పరతతో మెలగాలని గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి అన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ప్రొబేషనరీ సివిల్‌ ఎస్‌ఐ (పీఎస్‌ఐ)లు 53 మంది మంగళవారం గుంటూరు కలెక్టర్‌ బంగ్లా రోడ్‌లోని గుంటూరు రేంజ్‌ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని మర్యాద పూర్వకంగా కలిశారు. పీఎస్‌ఐలను ఉద్దేశించి ఐజీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ, నేర పరిశోధన, సాంకేతిక పరిజ్ఞానం, పోలీసింగ్‌లో ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవాలని అన్నారు. పోలీస్‌ స్టేషన్లను నిర్వహించే విధానాలు, రికార్డులు, చట్టాలు, భౌగోళిక పరిస్థితులపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం 53 మంది ఎస్‌ఐలలో 36 మంది పురుషులు, 17 మంది మహిళా ఎస్‌ఐలు రిపోర్ట్‌ చేశారు. గుంటూరు జిల్లాకు 23, పల్నాడు జిల్లాకు 13, బాపట్ల జిల్లాకు 10, ప్రకాశం జిల్లాకు ఒక్కరు చొప్పున, శ్రీపొట్టిశ్రీరాముల నెల్లూరు జిల్లాకు ముగ్గురు, తిరుపతికి ముగ్గుర్ని కేటాయించారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా ఏఆర్‌ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, పోలీస్‌ అధికారులు పాల్గొన్నారు.

క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి

నగరంపాలెం: ప్రొబేషనరీ సివిల్‌ ఎస్‌ఐ (పీఎస్‌ఐ)లు సమర్థంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ అన్నారు. గుంటూరు జిల్లాకు కేటాయించిన 23 మంది పీఎస్‌ఐలు, ఉద్యోగోన్నతి పొందిన ఆరుగురు ఎస్‌ఐలు మంగళవారం నగరంపాలెంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధత, సమయపాలన, సేవా గుణం కీలకమని అన్నారు.

గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట్రతిపాఠి రేంజ్‌కు 53 మంది పీఎస్‌ఐలు కేటాయింపు

నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి 1
1/1

నిబద్ధతతో విధులు నిర్వర్తించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement