
జాతీయ ఈత పోటీలకు వ డ్డేశ్వరం బాలికలు
తాడేపల్లి రూరల్: ఆగస్టులో జరగున్న జాతీయస్థాయి స్విమ్మింగ్ పోటీలకు వడ్డేశ్వరం జిల్లా పరిషత్ పాఠశాలకు చెందిన బాలికలు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జి.సుబ్బారావు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 19, 20 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ అమ్యెచూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖలో జరిగిన సబ్ జూనియర్ కేటగిరిలో తమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఎస్‌కె నజ్రీన్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్, 200 మీటర్ల బటర్‌ఫ్లై లలో మొదటి స్థానం, 100 మీటర్ల బటర్ ఫ్లైలో ద్వితీయ స్థానంలో, 200 మీటర్ల పాడ్యవల్ మెడ్లిలో మూడవ స్థానంలో నిలిచిందని తెలిపారు. నస్రీన్ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో మొదటి స్థానంలో నిలిచి ఆగష్టు 4,5 తేదీల్లో బెంగళూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. క్రీడాకారులను పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం కె.జోజప్ప, వ్యాయామ శిక్షకులు మెల్లెంపూడి రవి, నూతక్కి రవి, ఉపాధ్యాయులు చావా శ్రీనివాసరావు, విజయకుమారి తదితరులు అభినందించారు.