
సీఏలకు పుష్కల అవకాశాలు
ఐసీఏఐ ఉపాధ్యక్షుడు ప్రసన్న కుమార్
గుంటూరు ఎడ్యుకేషన్: చార్టర్డ్ అకౌంటెంట్లు (సీఏ)లకు దేశవ్యాప్తంగా డిమాండ్ నెలకొని ఉందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) ఉపాధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్ అన్నారు. ఐసీఏఐ గుంటూరు చాప్టర్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సీఏ విద్యార్థుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ప్రసన్నకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడారు. సీఏ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఐసీఏఐ కృషి చేస్తోందన్నారు. గుంటూరులో సీఏ విద్యార్థుల కోసం ఐసీఏఐ భవన్‌ను ఆధునిక వసతులతో నిర్మిస్తున్నామని తెలిపారు. సీఏ కోర్సుల విద్యార్థులకు ఐసీఏఐ స్టైఫండ్ ఇస్తోందన్నారు. సమావేశంలో ఐసీఏఐ వైస్ ప్రెసిడెంట్ డి.ప్రసన్నకుమార్, సదరన్ ఇండియా రీజినల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు, కార్యదర్శి ఎన్.రాజశేఖర్, గుంటూరు బ్రాంచి చైర్మన్ చింతా రఘునందన్, వైస్ చైర్మన్ బి.ఝాన్సీ లక్ష్మి, కార్యదర్శి వనిమిరెడ్డి వి. నరేష్ తదితరులు పాల్గొన్నారు.