
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు సంబంధించి పలువురిని రాష్ట్ర కార్యదర్శులుగా (పార్లమెంట్) నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు శనివారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. గుంటూరు జిల్లాకు చెందిన నిమ్మకాయల రాజనారాయణ, మందపాటి శేషగిరిరావు, షేక్ గులాంరసూల్‌లను రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. గుంటూరు పార్లమెంట్ జిల్లా పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలను వీరికి కేటాయించటం జరుగుతుందని తెలిపారు. వీరు పార్టీ కేంద్ర కార్యాలయంతో సమన్వయం చేసుకుంటూ సంబందిత రీజినల్ కోఆర్డినేటర్‌లు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులకు సహాయసహకారాలు అందిస్తారని తెలిపారు.
ఆర్టీఐ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడిగా అవుతు శ్రీధర్‌రెడ్డి
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లాకు చెందిన అవుతు శ్రీధర్‌రెడ్డిని పార్టీ ఆర్టీఐ విభాగం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.

వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం

వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శుల నియామకం