
19 నుంచి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19, 20వ తేదీల్లో 52వ జిల్లా స్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అండర్–11 నుంచి అన్ని విభాగాలతోపాటు మాస్టర్స్ విభాగంలో 35 + నుంచి 70 + వరకు పోటీలు ఉంటాయన్నారు. విజయాలు సాధించిన వారిని విభాగాలుగా రాష్ట్ర పోటీలకు పంపిస్తామని తెలిపారు. అనంతరం పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను శ్రీనివాసరావుతోపాటు రమేష్, వెంకటేశ్వరరావు, సతీష్ చంద్ర, రాము, రమేష్. కోచ్ బాషా ఆవిష్కరించారు.