
మధ్యవర్తిత్వంపై అవగాహన సదస్సు
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు 90 రోజుల మధ్యవర్తిత్వ డ్రైవ్‌లో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ భవన్‌లో బుధవారం క్షక్షిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్యానెల్ అడ్వకేట్‌లు, పారా లీగల్ వలంటీర్లు, కక్షిదారులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి ఆధ్వర్యంలో ర్యాలీ ప్రారంభించారు. మెడికల్ కాలేజీ రోడ్ నుంచి పోలీస్ పరేడ్ గ్రౌండ్ మీదుగా తిరిగి జిల్లా కోర్ట్ ప్రాంగణం వరకు ర్యాలీ కొనసాగింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి అవగాహన సదస్సును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ మధ్యవర్తిత్వంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. రాజీపడదగిన అన్ని సివిల్, క్రిమినల్, భార్యాభర్తల వివాదాలు, కుటుంబ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా రాజీ చేసుకొని కేసులను సత్వరమే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం ఇన్సూరెనన్సు కంపెనీస్, చిట్‌ఫండ్ కంపెనీస్, ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషన్స్, ఇతర స్టేక్ హోల్డర్లకు మధ్యవర్తిత్వం వల్ల ఉపయోగాలను వివరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్ జియావుద్దీన్ మాట్లాడుతూ మధ్యవర్తిత్వంపై వారం రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జి.చక్రపాణి,.ఆర్.శరత్ బాబు, ఎ.వి.ఎల్.సత్యవతి, సి.హెచ్.వి.ఎన్. శ్రీనివాసరావు, వై.నాగరాజా, షమ్మీ పర్వీన్ సుల్తానా బేగం, కె.నీలిమ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్, మీడియేషన్ అడ్వొకేట్లు, పారా లీగల్ వలంటీర్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, చిట్‌ఫండ్ కంపెనీస్, ఫైనాన్సియల్ ఇనిస్టిట్యూషనన్స్, స్టేక్ హోల్డర్స్, జిల్లా న్యాయ సేవాధికార సిబ్బంది పాల్గొన్నారు.