
రాష్ట్ర స్థాయి ఈత పోటీలకు శివసాకేత్
నరసరావుపేట ఈస్ట్: రాష్ట్రస్థాయి 10వ జూనియర్స్ స్విమ్మింగ్ పోటీలకు శ్రీసుబ్బరాయ అండ్ నారాయణ కళాశాల విద్యార్థి కె.శివసాకేత్ ఎంపికై నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎస్.సుధీర్, వ్యాయామ అధ్యాపకుడు డాక్టర్ యక్కల మధుసూదనరావు బుధవారం తెలిపారు. గుంటూరు శ్యామలానగర్‌లోని ఎన్టీఆర్ స్విమ్మింగ్ పూల్‌లో నిర్వహించిన ఉమ్మడి గుంటూరుజిల్లా స్విమ్మింగ్ టీమ్ ఎంపిక పోటీల్లో శివసాకేత్ పాల్గొని 50, 100, 200 మీటర్లు బటర్ ఫ్లయి, 200, 400 మీటర్లు ఫ్రీ స్టయిల్ విభాగాలకు ఎంపికై నట్టు వివరించారు. విశాఖపట్నంలో ఈనెల 19, 20 తేదీలలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో శివసాకేత్ ఉమ్మడి గుంటూరుజిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తాడని తెలిపారు. కళాశాల పాలకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు కపలవాయి విజయకుమార్, నాగసరపు సుబ్బరాయగుప్త, ప్రిన్సిపాల్ డాక్టర్ సుధీర్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.శ్రీనివాససాయి, కోచ్ జి.సురేష్, అధ్యాపకులు శివసాకేత్‌ను అభినందించారు.