
భయంతోనే సర్పంచ్ హత్యకు ధూళిపాళ్ల కుట్ర
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): సర్పంచ్ నాగ మల్లేశ్వరరావు కుటుంబాన్ని చూసి పొన్నూరు టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర భయపడ్డారని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ అన్నారు. అందుకే మినీ మహానాడులో అంతమొందించాలని వ్యాఖ్యలు చేసి, ఆ మేరకు అమలు చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పొన్నూరు నియోజకవర్గం మన్నవ గ్రామంలో అతి కిరాతకంగా సర్పంచ్ బొనిగల నాగ మల్లేశ్వరరావుపై టీడీపీ గూండాలు దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడి గుంటూరులోని రమేష్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగ మల్లేశ్వరరావును బుధవారం స్థానిక సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ, వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శైలజానాథ్ మాట్లాడుతూ పొన్నూరులో అంబటి మురళీకృష్ణకు ఓటింగ్ శాతం పెరగడాన్ని ధూళిపాళ్ల జీర్ణించుకోలేక పోయారన్నారు. నాగ మల్లేశ్వరరావుపై హత్యాయత్నం ఘటనలో గత్యంతరం లేక పోలీసులు కేసు పెట్టినట్లు ఉందని, రిమాండ్ రిపోర్ట్ ఇంకా పూర్తి కాకుండానే కేసులో నిందితులుగా ఉన్న ఏ–4, ఏ–5 లను తొలగించినట్లు వార్తలు వస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర చరిత్రలో చార్జిషీట్ దాఖలు చేయకుండానే, ఎంకై ్వరీ జరగకుండానే పేర్లు తొలగించడం ఎక్కడా జరగలేదన్నారు.
రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం...
రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన బెట్టి.. నారా లోకేష్ రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగ మల్లేశ్వరరావుకు ప్రాణం మిగిలింది కాబట్టి హత్యాయత్నం అయిందని, అదే ప్రాణం పోయి ఉంటే హత్య అయ్యేదన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులతో రాజకీయంగా పోరాటం చేయాలిగానీ ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నడూ లేని క్రూరమైన పాలన చూస్తున్నామని పేర్కొన్నారు.
మినీ మహానాడులో వ్యాఖ్యలు అమలులో భాగంగానే సర్పంచ్‌పై పాశవిక దాడి వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ మండిపాటు
మానవత్వం లేని వ్యక్తి నరేంద్ర
కనీస మానవత్వం, దయ లేని వ్యక్తి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అని వైఎస్సార్ సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ ధ్వజమెత్తారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ధూళిపాళ్లేనని స్పష్టం చేశారు. హింసా రాజకీయాలకు బదులు చెప్పే రోజులు వస్తాయని హెచ్చరించారు.