
కార్మెల్ మాత ఉత్సవాలు
రేపటి నుంచి
ఫిరంగిపురం: స్థానిక కార్మెల్ కొండపై కొలువైఉన్న కార్మెల్ మాత ఉత్సవాలు ఈనెల 14,15,16వ తేదీల్లో నిర్వహించనున్నట్లు బాలఏసు దేవాలయ విచారణ గురువులు మాలపాటి ఫాతిమా మర్రెడ్డి శనివారం తెలిపారు. ఉత్సవాలకు గుంటూరు జిల్లా మేత్రాసన గురువులు చిన్నాబత్తిని భాగ్యయ్య హాజరై, సమష్టి దివ్య పూజాబలి పూజల్లో పాల్గొంటారని చెప్పారు.
● 14న ఉదయం 5.30 గంటలకు బాల ఏసు దేవాలయంలో దివ్యపూజాబలి నిర్వహిస్తామన్నారు. సాయంత్రం కార్మెల్ మాత కొండ వద్ద ఫాదర్లు వై. అంథోనిరాజు, పి.జోజిరాజుల ఆధ్వర్యంలో దివ్య పూజా బలి కార్యక్రమాలు ఉంటాయి.
● 15న ఉదయం 8 గంటలకు, 12 గంటలకు ఫాదర్లు ఫాతిమా మర్రెడ్డి, బి.మరియ పవన్ కుమార్ ఆధ్వర్యంలో కొండపై దివ్య పూజాబలి ఉంటుంది. మధ్యాహ్నం సెయింట్‌పాల్స్ హైస్కూల్‌లో అన్నదానం, సాయంత్రం 5గంటలకు దివ్య సత్ప్రసాద ప్రదక్షిణ, ఆరాధన ఉంటుంది. దివ్య సత్ప్రసాదం, కార్మెల్‌మాత స్వరూపంతో బాల ఏసు దేవాలయం నుంచి కార్మెల్ మాత కొండ వరకు ప్రదక్షిణ నిర్వహిస్తారు. అఖండ జపమాలను మరియ దళ సభ్యులు పఠిస్తారు.
● 16న ఉదయం 6 గంటలకు దివ్య పూజాబలి పూజలు, అనంతరం తేరు ప్రదక్షిణ ఉంటుంది.
భక్తులకు సకల సదుపాయాలు
కార్మెల్ మాత ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు విచారణ గురువులు ఫాతిమా మర్రెడ్డి తెలిపారు. నీటి సదుపాయం, రెండురోజుల పాటు అన్నదానం, విశ్రాంతి గదులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఉత్సవాలకు భారీ బందోబస్తు
భక్తులకు అసౌకర్యం కలుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఐ శివరామకృష్ణ తెలిపారు. సమీప స్టేషన్ల నుంచి 130 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు. వాహనాలు పార్కింగ్ కోసం సెయింట్ పాల్స్ ప్లే గ్రౌండ్, మార్నింగ్ స్టార్ కళాశాల గ్రౌండు, అల్లంవారిపాలెం రైల్వేగేటు సమీపంలో స్థలాలను ఎంపిక చేశామని చెప్పారు.
పెద్దఎత్తున భక్తుల రాక ఏర్పాట్లు పూర్తి

కార్మెల్ మాత ఉత్సవాలు