
జీడీసీఏ జిల్లా అధ్యక్షుడిగా రాకేష్ చౌదరి
గుంటూరు వెస్ట్ (క్రీడలు): గుంటూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్(జీడీసీఏ) నూతన అధ్యక్షుడిగా చుక్కపల్లి రాకేష్ చౌదరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని జీడీసీఏ ఉపాధ్యక్షుడు తోట వెంకట శివ రామకృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం నిర్వహించిన ఎన్నికలకు ఎలక్షన్ ఆఫీసర్‌గా వెంకటరత్నం వ్యవహరించారన్నారు. కార్యదర్శిగా ఎనుముల శ్రీధర్, సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ కొంగర రాహుల్ చౌదరి, ఉపాధ్యక్షుడిగా తోట వెంకట శివరామకృష్ణ, కోశాధికారిగా సింగరాజు లక్ష్మీకాంత్, కౌన్సిలర్‌గా నందిరాజు శివ రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్నారు.