
శృతి మించిన నరేంద్ర అరాచకాలు
వైఎస్సార్ సీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అరాచకాలు శృతి మించి హత్యారాజకీయాలకు తెరలేపారని విమర్శించారు. పోలీసుల సహకారంతో నియోజకవర్గంలో అకృత్యాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. మన్నవ గ్రామ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై పట్టపగలు ప్రధాన రహదారి పక్కన పాశవికంగా ఇనుపరాడ్లుతో దాడి చేయడం వెనుక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పాత్ర ఉందని ఆరోపించారు. మినీ మహానాడులో నరేంద్ర మాట్లాడిన మాటలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. టీడీపీ హత్యా రాజకీయాలు, అరాచకాలను నిరసిస్తూ అవసరమైతే గ్రామగ్రామాన పాదయాత్ర చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉండి వారిని కాపాడుకుంటానని చెప్పారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ ద్వారా పార్టీ శ్రేణులు గ్రామగ్రామాన ప్రతి ఇంటికీ వెళ్లి టీడీపీ మోసాలను గుర్తు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.