
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు
గుంటూరు వెస్ట్: అర్జీల పరిష్కారంలో అలసత్వానికి తావివ్వొద్దని జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ తెలిపారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జేసీ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. కొన్ని అర్జీలు వివిధ శాఖలు సమన్వయంతో పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. వీటిపట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. కోర్టు కేసులకు సంబంధించి ఆన్సర్లు నిర్ణీత గడువులోనే దాఖలు చేయాలన్నారు. అధికారులు అవసరమైన మేరకు లీగల్ టీమ్ సహాయం తీసుకోవాలన్నారు. అర్జీలు బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి వెళ్లక ముందే పరిష్కరించాలన్నారు. ప్రజలు తమ అర్జీలను ప్రజలు స్థానికంగా ఉండే మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయి అధికారులకు ప్రతి వారం ఇవ్వొచ్చన్నారు. దీంతో స్థానికంగా ఉండే ప్రజల సమస్యలు అక్కడే పరిష్కారమవుతాయన్నారు. అనంతరం వచ్చిన 302 అర్జీలను జేసీతోపాటు డీఆర్వో ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీకుమారి, జిల్లా అధికారులు పరిశీలించారు.
జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ