
మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025
తాడేపల్లి రూరల్: రాజధానిలో మట్టి మాఫియా చెలరేగుతోంది. అర్ధరాత్రి దొరికిన చోటల్లా తవ్వకాలు చేస్తున్నారు. బహిరంగా మార్కెట్‌లో అమ్ముకుని జేబులు నింపుకుంటున్నారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు యర్రబాలెం, నవులూరు, కృష్ణాయపాలెం, మందడంలతో పాటు పలు ప్రాంతాల్లో మట్టి మాఫియా చెలరేగిపోయింది. ఒక్కో ప్రాంతంలో లోడింగ్ చేయడానికి రెండు నుంచి ఐదు జేసీబీలు, మట్టి తవ్వేందుకు భారీ పొక్లయిన్లు వినియోగించారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు యథేచ్ఛగా తవ్వకాలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు.
ప్రతి నెలా మామూళ్లు
మంత్రి అండదండలు ఉన్న మాజీ ప్రజాప్రతినిధి భర్త ప్రతి నెలా పోలీసులకు, సీఆర్‌డీఏ అధికారులకు లక్షలాది రూపాయలు ఇస్తున్నారని స్థానికుల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధానిని కాపాడాల్సిన వ్యక్తులే ఇలాంటి చర్యలకు పాల్పడటంపై భూములు ఇచ్చిన రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. గతంలో ఎవరైనా మట్టి తవ్వుకుంటే రాజధానికి భూములిస్తే గుంతల మయం చేస్తారా ? అంటూ విలేకరుల సమావేశం పెట్టిన మాట్లాడిన వారే ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికై నా సీఆర్‌డీఏ అధికారులు, పోలీసులు మట్టి మాఫియాపై దృష్టి సారించకపోతే భవిష్యత్తులో రాజధాని గుంతలమయం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కృష్ణాయపాలెం వద్ద మట్టి మాఫియా
పార్కింగ్ చేసిన పొక్లయిన్
న్యూస్‌రీల్
రాజధానిలో భారీ యంత్రాలతో మట్టి తవ్వకాలు 50 నుంచి 100 లారీల్లో తరలింపు లారీ రూ.15 వేలకు అమ్మకం పలు ప్రాంతాల్లో పొక్లెయిన్ల పార్కింగ్ పట్టించుకోని సీఆర్‌డీఎ అధికారులు గతంలో రాజధానిలో గుంతలు పెడుతున్నారని ఆరోపించిన వారే సూత్రధారులు పోలీసులకు మామూళ్లు ఇస్తున్నామంటూ బహిరంగ వ్యాఖ్యలు
మంగళగిరి చుట్టుపక్కల జరుగుతున్న మట్టి మాఫియాకు మున్సిపల్ శాఖ మంత్రి దగ్గరి అనుచరుడు, యర్రబాలేనికి చెందిన మాజీ ప్రజాప్రతినిధి భర్త అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులను, సీఆర్‌డీఏ అధికారులను మంత్రి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడి ఈ తవ్వకాలు నిర్వహిస్తున్నాడు. ఒక్క రాత్రిలోనే పలు ప్రాంతాల్లో 10 నుంచి 20 జేసీబీలు, ఐదు పొక్లెయిన్‌లు, 50 నుంచి 100 వరకు టెన్ టైర్లు టిప్పర్లను ఉపయోగిస్తున్నాడు. పగటిపూట ఎవరైనా బిల్డింగ్‌లు కట్టుకుంటుంటే వారికి ఏ రకమైన మట్టి కావాలో అడిగి, రాజధాని ప్రాంతంలో దాన్ని తవ్వి అందజేస్తున్నారు. ఒక లారీకి రూ. 10వేల నుంచి రూ. 15 వేల రూపాయలు వసూలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు ఐదు ప్రాంతాల్లో జరిగే ఈ తవ్వకాల్లో ఒక్కొక్క లారీతో 5 నుంచి 10 ట్రిప్పుల వరకు మట్టిని బయటకు తరలిస్తున్నట్లు కొంతమంది లారీ యజమానులు ఆరోపిస్తున్నారు.

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025

మంగళవారం శ్రీ 15 శ్రీ జూలై శ్రీ 2025