
● ఉమ్మడి గుంటూరు జిల్లాలో 39,693 మంది విద్యార్థులు హాజర
ముగిసిన ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఏపీ ఈఏపీసెట్–2025 ఆన్‌లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్టులు (సీబీటీ) మంగళవారంతో ముగిశాయి. ఈ నెల 19న ప్రారంభమైన పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా జరిగాయి. ఈ నెల 19, 20వ తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. 21 నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోని 22 కేంద్రాల పరిధిలో అగ్రికల్చర్, ఫార్మసీ, ఇంజినీరింగ్ పరీక్షలకు దరఖాస్తు చేసిన 41,384 మంది విద్యార్థుల్లో 39,693 మంది హాజరయ్యారు.
జిల్లాల వారీగా పరిశీలిస్తే...
● గుంటూరు జిల్లాలోని 15 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 25,731 మందిలో 24,607 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ పరీక్షకు 21,590 మందికిగాను 20,765; అగ్రిల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశ పరీక్షకు 4,141 మందికిగాను 3,842 మంది హాజరయ్యారు.
● పల్నాడు జిల్లాలోని 5 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసిన 11,142 మందికిగాను 10,746 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 9,214 మందికిగాను 8,944 మంది; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,928 మందికిగాను 1,802 మంది హాజరయ్యారు.
● బాపట్ల జిల్లాలో బాపట్ల, చీరాలలో ఏర్పాటు చేసిన 2 కేంద్రాల పరిధిలో దరఖాస్తు చేసుకున్న 4,511 మందికిగాను 4,340 మంది హాజరయ్యారు. వీరిలో ఇంజినీరింగ్‌కు 3,409 మందికిగాను 3,304; అగ్రిల్చర్, ఫార్మసీ పరీక్షకు 1,102 మందికిగాను 1,036 చొప్పున హాజరయ్యారు.