
గుంటూరు
శుక్రవారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2025
సాక్షికి పోరాటాలు కొత్త కాదు
సాక్షికి పోరాటాలు కొత్త కాదు. ఎడిటర్ ఇంటిపై దాడిచేయడం తగదు. నచ్చని విషయాలు రాస్తే అణచివేయాలని చూస్తారా? రెండు నెలల క్రితం పుట్టిన సంస్థకు
రూ.కోట్ల విలువైన భూముల ఇచ్చేసి, ఆ విషయాన్ని రాయొద్దంటే ఎలా? తప్పు చేస్తే ప్రెస్ కౌన్సిల్, న్యాయస్థానాలకు ఫిర్యాదు చేయాలి. ఇంటికి పోలీసులను పంపడం తగదు. ఎంత అణచివేయాలని చూస్తే. సాక్షి అంతగా పైకి లేస్తుంది. – పి.శ్రీనివాస్, అసోసియేట్ ఎడిటర్, సాక్షి దినపత్రిక
పోలీసుల చొరబాటు హేయం
‘సాక్షి’ ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిలోకి పోలీసుల చొరబాటు హేయమైన చర్య. అకారణంగా ఇంట్లోకి పోలీసులు చొరబడటం సబబు కాదు. గౌరవ ప్రదమైన వ్యక్తుల ఇళ్లకు వెళ్లేటప్పుడు సెర్చ్ వారెంటు తీసుకోవాలి. మరోసారి ఇలాంటివి జరక్కుండా ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలి.
– చిలుకా చంద్రశేఖర్, ఏపీ పౌరహక్కుల సంఘం
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి , సత్తెనపల్లి
ఇది ప్రజా స్వామ్యమా? నియంతృత్వమా?
మీడియా ఎడిటర్ ఇంటిపై దాడి దేశంలోనే ఇది ప్రప్రథమం. ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటే అడిగే హక్కు ఎవరికీ లేదా? ఇది ప్రజా స్వామ్యమా? నియంతృత్వమా? పది నెలల్లోనే రాజ్యాంగాన్ని తిరగరాసి రెడ్‌బుక్ అమలు చేస్తానంటే చూస్తూ ఊరుకోవాలా? ఇది సాక్షి ఎడిటర్ ఇంటిపై మాత్రమే జరిగిన దాడి కాదు.. ప్రజాస్వాయ్యంపై జరిగిన దాడి.
– బి.వి.రాఘవరెడ్డి, ఏపీ నెట్‌వర్క్ ఇన్‌చార్జి, సాక్షి దినపత్రిక
9
న్యూస్‌రీల్

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు

గుంటూరు