
27వ రోజుకు సీహెచ్‌ఓల సమ్మె
లక్ష్మీపురం(గుంటూరు పశ్చిమ): వైద్య ఆరోగ్య శాఖ ఎన్‌హెచ్‌ఎంలో ఆరేళ్లుగా సీహెచ్‌ఓలుగా గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవలు అందిస్తున్నామని, రెండేళ్లుగా మా సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిరవధిక సమ్మె చేస్తున్నామని గుంటూరు జిల్లా జనరల్ సెక్రటరీ పల్లపాటి లింగరాజు, జిల్లా ఉపాధక్షరాలు జి.వనజ అన్నారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ వద్ద డీఎంఅండ్ హెచ్‌ఓ కార్యాలయం వద్ద సీహెచ్‌ఓలు చేస్తున్న సమ్మె శనివారం నాటికి 27వ రోజుకు చేరింది. వారు మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ నిబంధనలు ప్రకారం ఉద్యోగ భద్రత కలిపించాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23శాతం వేతన సవరణ చేయాలన్నారు. అసోసియేషన్ నాయకులతో త్వరితగతిన చర్చలు జరిపి స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షరాలు టీ ప్రవళిక, జిల్లా నాయకురాలు జోత్స్న మాట్లాడుతూ ఇన్ని రోజులుగా తీవ్రమైన ఎండలలో కూడా నిరవధిక సమ్మె చేస్తున్న సీహెచ్‌ఓలను పట్టించుకోకుండా, జీతాలు వేయకుండా, ఇన్సెంటివ్‌లు వేయకుండా తీవ్ర మనోవేదనకు కూటమి ప్రభుత్వ అధికారులను గురి చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షరాలు జి.వనజ, జిల్లా నాయకులు సంధ్య, దీక్షిత, రవితేజ, జీవనజ్యోతి, కె లక్ష్మి, రత్నకుమారి, క్వీన్, స్వప్న, కె.లక్ష్మి, శివ నాగేంద్రమ్మ, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పాల్గొన్నారు.
స్పందించని కూటమి ప్రభుత్వం